ప్రభుత్వ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇన్ క్రెడిబుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తోగాడి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌లో... 2018 సంవత్సరంలో 298ఎకరాల భూమి కొనుగోలు చేసినట్టు తెలిపారు. 120 ఎకరాల భూమిలో లే-అవుట్ చేసి కన్వర్షన్ కోసం పంచాయతీ కార్యదర్శి ద్వారా డీటీసీపీకి 2020 ఫిబ్రవరి 8న అన్ని డాక్కుమెంట్లతో దరఖాస్తు చేశారు. నెల రోజులు గడిచినప్పటికీ... అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పలుమార్లు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తెచ్చినట్టు చెప్పారు.
లే-అవుట్ మంజూరు ఆలస్యం అవుతుండటం వల్ల వెంచర్లో పనులు ప్రారంభిస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్టు ప్రవీణ్ కుమార్ తోగాడి వెల్లడించారు. లే-అవుట్ దరఖాస్తు 21 రోజుల్లో పరిష్కరించకపోతే అది మంజూరు అయినట్లేనని మంత్రి కేటీఆర్ పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. తాము పనులు చేపట్టగా... జిల్లా పంచాయతీ అధికారి వెంచర్ వద్దకు వచ్చి... కూలీలను బెదిరించడమే కాకుండా... ఎవరూ ప్లాట్లు కొనుగోలు చేయొద్దని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రూ.25 లక్షల విలువ చేసే మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారని వాపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయకుండా... ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: రెవెన్యూ శాఖలో 524 మంది కొత్త ఉద్యోగులు..!