ETV Bharat / city

ఆర్టీసీకి ఆదాయ గండం..కుదేలైనా ప్రగతి చక్రం

లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ప్రారంభమైన ప్రస్తుత స్థితిలో ప్రజారవాణా నిర్వహణపైనా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు నడిపే విషయంపై ప్రభుత్వ స్థాయిలో మేధోమథనం జరుగుతోంది. ఇప్పటికే పుట్టెడు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ గత నెలన్నర రోజులుగా బస్సులు తిరగకపోవడంతో ఆదాయం కోల్పోయి మరింత కుదేలైంది. సంస్థను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

income problem for telangana rtc due to corona crisis
ఆర్టీసీకి ఆదాయగండం
author img

By

Published : May 11, 2020, 8:56 AM IST

కరోనా వైరస్‌ కట్టడి కోసం వ్యక్తుల మధ్య దూరం పాటించటం తప్పనిసరి. అదే ప్రజారవాణాకు పెద్ద సవాలు కానుంది. దీన్ని అమలు చేయాలంటే ఒక్కో బస్సులో 25 మందికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదు. దీనివల్ల మరింత నష్టాలొస్తాయి. కరోనా నేపథ్యంలో ఆర్టీసీల ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండర్‌ టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్టీయూ)ల ద్వారా కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. ఇతర రంగాల మాదిరిగా ఆర్టీసీలకు ఉద్దీపన పథకాన్ని కేంద్రం ప్రకటిస్తుందా? లేదా? అనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది. దీనిపై ప్రజారవాణా రంగానికి సంబంధించిన నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

15వ తేదీ తరువాత నిర్ణయిస్తాం

ఆర్టీసీ బస్సులు నడిపే విషయంలో ఈ నెల 15వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వ్యూహరచన చేస్తాం. వ్యక్తిగత దూరం అమలు చేయాలంటే బస్సులో 50 శాతానికి మించి ప్రయాణికులను అనుమతించలేం. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బస్సులో శానిటైజర్లను అందుబాటులో ఉంచుతాం. నష్టాలను ఎలా అధిగమించాలన్న అంశంపై చర్చిస్తాం.

- సునీల్‌శర్మ, ఇన్‌ఛార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌

కేంద్రం ఆర్థిక చేయూత ఇవ్వాలి

ఇకపై బస్సుల్లో ప్రయాణికుల మధ్య దూరం అనివార్యం. ఖాళీ సీట్ల నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రాష్ట్ర రవాణా సంస్థలకు ఇవ్వాలి. ఇప్పటికే ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రజారవాణా సంస్థలు దాదాపుగా మూతపడ్డాయి. కేంద్రం సహకరించకపోతే ఇతర రాష్ట్రాలు కూడా ఆ బాటనే పడతాయి. సర్వీసుల సంఖ్యను తగ్గించాలి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బాగా తగ్గినందున ఆ ప్రయోజనాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు ఇవ్వాలి.

- నాగరాజారావు, కర్ణాటక ఆర్టీసీ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌

రూ. 40 వేల కోట్లతో ఉద్దీపన ప్రకటించాలి

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీలను ఆదుకునేందుకు కేంద్రం కనీసం రూ. 40 కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలి. విద్యుత్తు బస్సుల కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ. పది వేల కోట్లు కేటాయించారు. పెట్రోలు, డీజిల్‌పై సెస్సు ద్వారా రూ. 1.62 లక్షల కోట్ల ఆదాయాన్ని కేంద్రం రాబట్టింది. అందులోంచి రూ. 30 వేల కోట్లు, విద్యుత్తు బస్సులకు కేటాయించిన రూ. 10 వేల కోట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలోని ఆర్టీసీలకు ప్యాకేజీలుగా ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీజిల్‌పై వ్యాట్‌, మోటారు వాహన పన్ను, సర్వీసు ఛార్జీలు, ఆస్తి పన్ను తదితరాలపై కనీసం మూడేళ్ల మారటోరియం ప్రకటిస్తే ఆర్టీసీపై భారం తగ్గుతుంది.

- ఎం.నాగేశ్వరరావు, మాజీ డైరెక్టర్‌, ఆర్టీసీ

స్టాపులు తగ్గించాలి

ఒక ప్రాంతం నుంచి బయలుదేరిన బస్సు గమ్యస్థానం చేరే లోపు పరిమిత సంఖ్యలోనే స్టాప్స్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలి. పరిస్థితి చక్కపడేంత వరకు పరిమిత సంఖ్యలో, నిర్ధారిత సమయాల్లో మాత్రమే బస్సులు నడపాలి. అత్యవసరమైతేనే బస్సుల్లో ప్రయాణించేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలి.

- డాక్టర్‌ సుదర్శనం, మాజీ డైరెక్టర్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.