- గతంలో వచ్చిన వైరస్‌లతో పోల్చుకుంటే కరోనా అత్యంత ప్రమాదకరమైనదేమీ కాదు. ప్రతి వ్యక్తిలో రోగనిరోధక శక్తి పూర్తిస్థాయిలో ఉంటే ఈ వైరస్ ఏమీ చేయదు. ఇప్పటి వరకు జరిగిన కరోనా మరణాలను పరిశీలిస్తే వృద్ధులు, చిన్నపిల్లలే బలయ్యారు. వైరస్‌పై మా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
- ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే దేశంలోని ప్రతి ఒక్కరూ ఇక నుంచైనా కూడా బలవర్ధక ఆహార పదార్థాలపై దృష్టి సారించాలి.
- పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి. ప్రధానంగా చిరుధాన్యాలను వినియోగించాలి. డ్రైఫ్రూట్స్ కూడా తీసుకుంటే బాగుంటుంది.
- పుల్లగా ఉండే పండ్లను తినడం వల్ల విటమిన్-సి సమృద్ధిగా అంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మ, బత్తాయి, కమలాపండ్లను ఈ సీజన్‌లో అధికంగా తీసుకోవచ్చు.
- అల్లం, వెల్లుల్లి, పసుపు, బొప్పాయి, గ్రీన్‌టీ తీసుకోవచ్చు.
- బొచ్చెలు, శీలావతి లాంటి తెల్లరకం చేపలను, పీతలను కూడా తీసుకోవచ్చు. పీతల్లో జింక్ లాంటి సూక్ష్మ పోషకాలు ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- రోజూ కచ్చితంగా మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి.
- వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరూ రోజుకు పదిసార్లయినా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. అప్పుడే ఈ వ్యాధి వ్యాప్తిని పూర్తిస్థాయిలో కట్టడి చేయగలం.
ఇవీ చూడండి: 60 వేల మందికి కరోనా వచ్చినా చికిత్సలకు సన్నద్ధం: సీఎం కేసీఆర్