ఐఐటీ హైదరాబాద్‌లో జరిగే పరిశోధనలు, విద్యార్థుల ఆవిష్కరణలతో పాటు ప్రాంగణంలో ఏం జరుగుతుందో తెలియజేసేందుకు... వేదికగా ఎలాన్-ఎన్ విజన్ వేడుకలు నిలుస్తున్నాయి. శాస్త్ర సంబంధమైన అంశాలతో వాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ఇతర నైపుణ్యాలను నిరూపించుకునే అవకాశం ఈ కార్యక్రమంతో లభిస్తుంది.
ఎలాన్ వేడుకలు నేటి నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవచ్చో ప్రయోగాత్మకంగా వివరించనున్నారు. పదులసంఖ్యలో స్టాళ్లు పెట్టి తాము చేసిన ప్రయోగాలను ప్రదర్శించనున్నారు. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్ర, సాంస్కృతికపరమైన వందలాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సాంకేతిక, సాంస్కృతిక విభాగాల్లో వివిధ పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. గెలుపొందిన వారికి బహుమతులూ అందజేస్తారు. ఎలాన్-ఎన్విజన్ కార్యక్రమ నిర్వాహణ పూర్తిగా విద్యార్థుల బాధ్యత తీసుకుని నిర్వహిస్తారు. ఎలాన్ నిర్వహణకు నిధుల సమీకరణ విద్యార్థులే చేపడతారు. ఖర్చు విషయంలోనూ పారదర్శకత పాటించి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు అదిరిపోయే ఆతిథ్యం సైతం అందిస్తారు. రెండేళ్లుగా దూరమైన ఆనందాన్ని ఆద్యంతం ఆస్వాదించేలా వేడుకలకు ఐఐటీ విద్యార్థులు సిద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి: