ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కేంద్రంపై మండిపడ్డారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ వైస్ ఛైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన తుర్కయాంజల్ రైతు సేవా సహకారం సంఘం 46వ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అర్హులైన రైతులకు పనిముట్లు అందజేశారు. రైతులకు కావాల్సిన పరికరాలను కొనుగోలు చేసి వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
"రైతుల శ్రేయస్సు, క్షేమమే ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. రైతుల వల్లే సహకార సంఘాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తుర్కయాంజల్ ఎఫ్ఎస్సీఎస్ రూ.2.89కోట్ల నికర లాభం ఆర్జించింది. 2022-23 అంచనా బడ్జెట్ రూ.4.11కోట్లుగా నిర్ణయించామన్నారు. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే సహకార సంఘం ఇంకా అభివృద్ధి పథంలో దూసుకెళ్లే అవకాశం ఉంది. తుర్కయంజాల్ ఎఫ్ఎస్సీఎస్ డీసీసీబీలో విలీన ప్రక్రియ పూర్తయింది. డీసీసీబీ ద్వారా రైతులకు విరివిగా లోన్లు వచ్చే అవకాశం ఉంది. రైతులు ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయించి నష్టపోకుండా.. తక్కువ వడ్డీకే సహకార బ్యాంకులో లోన్లు తీసుకొని, నిర్ణీత కాలంలో చెల్లిస్తే లాభాలు గడించవచ్చు." - మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
ఇదీ చూడండి: