ETV Bharat / city

KCR: సీఎంఓ సెక్ర‌ట‌రీగా రాహుల్​ బొజ్జా... కేసీఆర్ కీలక ప్రకటన

ద‌ళిత బంధు ప‌థ‌కం ప్రారంభోత్స‌వ వేదిక‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం ఎస్సీ సంక్షేమ‌ శాఖ సెక్ర‌ట‌రీగా ఉన్న రాహుల్ బొజ్జాను సీఎంఓ సెక్ర‌ట‌రీగా నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

author img

By

Published : Aug 16, 2021, 5:37 PM IST

IAS RAHUL BOJJA WILL APPOINTED AS CMO SECRETARY
సీఎంఓలోకి రాహుల్​ బొజ్జా... కేసీఆర్ కీలక ప్రకటన

కరీంనగర్‌ జిల్లా శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. పైలట్‌ ప్రాజెక్టుగా హుజురాబాద్‌ మొత్తం పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే దళితబంధు పథకం ప్రారంభోత్సవ వేదికపై కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్న రాహుల్​ బొజ్జాను... సీఎంఓ సెక్రటరీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

రాహుల్​ బొజ్జా ఎస్సీ. వాళ్ల నాన్న బొజ్జా తారకం.. ఉద్యమంలో పనిచేసిన వారికి న్యాయవాదిగా ఉండే వారు. ఆయన కుమారుడే రాహుల్ బొజ్జా. రాహుల్​ బొజ్జా ఎస్సీ వెల్ఫేర్​ సెక్రటరీగా ఉండటమే కాదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీగా ఉండాలని నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు.

రాహుల్‌ బొజ్జాను సీఎంఓలో కార్యదర్శిగా నియమిస్తున్నాం. ఆయన నా ఆదేశాలన్నీ అమలు కావాలె. రేపట్నుంచి నా కార్యాలయంలో సెక్రటరీగా ఉంటారు.. నిధులకు భయపడకుండా దళితబంధు అమలు చేస్తాం.

- సీఎం, కేసీఆర్

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.