ETV Bharat / city

ఏపీ కేడర్​కు శ్రీలక్ష్మీ.. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్​ - ఏపీకి రిపోర్టు చేసిన ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి... ఏపీ కేడర్​కు రిపోర్ట్ చేశారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖకు ఆమె రిపోర్టు చేశారు. త్వరలోనే ఆమెకు పోస్టింగ్ దక్కే అవకాశం ఉంది.

ఏపీ కేడర్​కు శ్రీలక్ష్మీ.. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్​

author img

By

Published : Dec 12, 2020, 3:53 PM IST

సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి ఏపీ కేడర్​లోకి చేరారు. తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఏపీ సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖలో ఆమె రిపోర్ట్ చేశారు. ఆమె కేడర్ మార్పునకు సంబంధించి కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ నుంచి అనుమతి రాగా... ఏపీ కేడర్​లో చేరినట్టు తెలుస్తోంది. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు సిబ్బంది వ్యవహారాలశాఖ ఆమె కేడర్ మార్పునకు అనుమతి ఇచ్చింది.

ఇప్పటి వరకు తెలంగాణ కేడర్​లో కొనసాగిన ఆమె కొంతకాలంగా ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతస్థాయిలో సిఫార్సులు చేసేందుకు ప్రయత్నాలు జరిగినా అవి సఫలీకృతం కాకపోవటంతో ఆమె క్యాట్​ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అఖిలభారత సర్వీసులోని 1988 బ్యాచ్​కు చెందిన శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో నిందితురాలిగా అరెస్టై ఉమ్మడి రాష్ట్రంలో సస్పెన్షన్​కు గురయ్యారు. గతంలోనే ఆమెపై సస్పెన్షన్​ను ప్రభుత్వం ఎత్తివేసింది.

ఇదీ చదవండి: 'ఊహించిన దాని కంటే వేగంగా ఆర్థికవ్యవస్థ రికవరీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.