ETV Bharat / city

గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

భాగ్యనగరంలో గత పది రోజులతో పోలిస్తే.. సోమవారం కేసుల నమోదు సంఖ్యలో తగ్గుదల కనిపించింది. అయితే ఆదివారం పరీక్షల సంఖ్య తగ్గడం వల్లే కేసుల సంఖ్య కూడా తగ్గిందని, లేదంటే ఇంకా ఎక్కువే నమోదై ఉండేవని చెబుతున్నారు. తాజాగా గ్రేటర్‌లో 273 మంది, రంగారెడ్డి జిల్లాలో 73, మేడ్చల్‌లో 48 మందికి కరోనా సోకగా 11 మంది మరణించారు.

hyderabad region comparatively registers less cases
గ్రేటర్‌లో తగ్గుతున్న కొవిడ్‌ కేసులు.. తాజాగా 273 మందికి వైరస్
author img

By

Published : Aug 4, 2020, 8:10 AM IST

హైదరాబాద్‌ నగరంలో గత పది రోజులుగా 500-600 మధ్య కొవిడ్‌ కేసులు నమోదవుతుండగా...సోమవారం వీటి సంఖ్యలో తగ్గుదల కనిపించింది. తాజాగా గ్రేటర్‌లో 273 మంది, రంగారెడ్డి జిల్లాలో 73, మేడ్చల్‌లో 48 మందికి కరోనా సోకింది. అయితే ఆదివారం పరీక్షల సంఖ్య తగ్గడం వల్లే కేసుల సంఖ్య కూడా తగ్గిందని, లేదంటే ఇంకా ఎక్కువే నమోదై ఉండేవని చెబుతున్నారు. ఇక గాంధీతోపాటు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 11 మంది మృతి చెందారు.. ఎల్‌బీనగర్‌, మలక్‌పేట, మేడ్చల్‌, అంబర్‌పేట, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌..ఇలా అన్ని చోట్ల వైరస్‌ వ్యాప్తి కన్పిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వద్ద పరీక్షల టోకెన్ల కోసం క్యూలో ఉంటున్నారు.

నగరం నుంచి రాకపోకలు...

లాక్‌డౌన్‌ ఎత్తివేత...ఇతర సడలింపులతో నగరం నుంచి సమీప జిల్లాలకు రాకపోకలు పెరుగుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కాకపోవడంతో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో సొంత వాహనాలతో తమ సొంతూళ్లకు వెళ్లి వస్తున్నారు. వైరస్‌ వ్యాప్తికి ఇదో ప్రధాన కారణంగా కన్పిస్తోంది. ఇలాంటి రాకపోకలపై ఎలాంటి ఆటంకం లేకపోవడంతో కొందరు కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. పుట్టిన రోజు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇందులో ఒక్కరికి కరోనా ఉన్నా మిగతావారికి సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఊళ్ల నుంచి వచ్చిన తర్వాత కూడా చాలామంది క్వారెంటైన్‌లో ఉండకుండా నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లే ఉద్దేశమున్నవారు ముందుగా పరీక్షలు చేయించుకొని నెగిటివ్‌ వచ్చాక వెళ్తే కొంత ఊరటని చెబుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.