ETV Bharat / city

శిరస్త్రాణంపైనే పోలీసు గురి! - imposing penalties for two wheeler who failed to wear helmet

ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారు శిరస్త్రాణం ధరించకపోతే చాలు.. హైదరాబాద్​ పోలీసులు టపీమని ఫొటో కొట్టేస్తున్నారు. శిరస్త్రాణం ధరించినా.. కొన్నిసార్లు పట్టీ సరిగ్గా పెట్టుకోలేదంటూ జరిమానా విధిస్తున్నారు.

penalties for two wheeler who failed to wear helmet
శిరస్త్రాణంపైనే పోలీసు గురి!
author img

By

Published : Jun 12, 2020, 8:13 AM IST

శిరస్త్రాణం లేకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్న వారిని లక్ష్యంగా చేసుకున్న హైదరాబాద్‌ పోలీసులు బైక్‌లు, స్కూటీలపై వెళ్తున్న వారిలో శిరస్త్రాణం కనిపించకపోతే చాలు.. టపాటపా ఫొటోలు తీస్తున్నారు. సగం శిరస్త్రాణం ధరించారని.. పట్టీ పెట్టుకోలేదంటూ మరీ జరిమానాలు విధిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలుకు ముందు ట్రాఫిక్‌ పోలీసులు నెలకు సగటున 3లక్షల కేసులు నమోదు చేస్తుండగా.. గత నెలలో 3.87లక్షల కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించారు.

ధరిస్తున్నా జరిమానాలొస్తున్నాయి

నగరం, శివారు ప్రాంతాల్లో రోజూ రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారుల్లో 30శాతం మంది తేలికైన వాటినే ధరిస్తున్నారు. ఇవి ప్రమాణాల ప్రకారం లేవంటూ పోలీసులు కేసులు నమోదు చేసి ఈ-చలాన్‌లు పంపుతున్నారు.

యువకుల్లో భయం ఉండాలని..

శిరస్త్రాణం ధరించకుండా వెళ్తున్న వారిలో ఎక్కువ మంది యువకులు, విద్యార్థులే ఉన్నారు. వారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. అనుసంధాన రహదారుల్లో ఫొటోలు తీస్తున్నారని వివరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.