తెలంగాణలో రాగల మూడ్రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీరప్రాంతాల్లో ఇంకా కొనసాగుతోందని తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉందని వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.
అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర మహారాష్ట్ర తీరం వరకు ఛత్తీస్గఢ్, విదర్భ, ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా 1.5 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. ఉత్తర అండమాన్ సముద్రం దానినానుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో సుమారుగా ఈ నెల 9న అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు.