హైదరాబాద్ లాలాపేటలోని రెయిన్ బో అనాథాశ్రమంలోని పిల్లలకు తనవంతు సాయం అందిస్తానని గ్రేటర్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత అన్నారు. సోమవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా అనాథ పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారికి నోట్బుక్లు పంపిణీ చేశారు.
చిన్నారులతో కలిసి శ్రీలత సహపంక్తి భోజనం చేశారు. పుట్టినరోజున చిన్నారులతో గడపడం సంతోషంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.