ETV Bharat / city

'ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్‌'గా హైదరాబాద్‌ - telangana minister ktr

hyderabad-city-recognized-as-the-tree-city-of-the-world
'ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్‌'గా హైదరాబాద్‌కు గుర్తింపు
author img

By

Published : Feb 18, 2021, 12:55 PM IST

Updated : Feb 18, 2021, 4:07 PM IST

12:53 February 18

ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్‌గా ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్

  • Happy to share that @arborday foundation (which works with FAO of UN) has recognised Hyderabad as a Tree city of the world. The only Indian city to be included in this list

    This is an acknowledgement of our efforts to improve green cover as part of #HarithaHaaram program 🎄 pic.twitter.com/nflM0svV2k

    — KTR (@KTRTRS) February 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్ కీర్తిలో మరో కలికితురాయి వచ్చి చేరింది. హైదరాబాద్ నగరం 'ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్' గా గుర్తింపు సాధించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తో కలిసి పనిచేసే అర్బోర్ డే ఫాండేషన్  హైదరాబాద్​కు ఈ బిరుదునిచ్చింది. హైదరాబాద్​తో పాటు 63 దేశాల్లోని 120 నగరాలు గ్లోబల్​గా ఈ గుర్తింపు దక్కించుకున్నాయి. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోని నగరాలు ఈ జాబితాలో స్థానం సంపాదించగా.. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక నగరంగా హైదరాబాద్ నిలిచింది. 

పచ్చదనం, గ్రీనరీ లో ఉత్తమ ఫలితాలు సాధిస్తోన్న భాగ్యనగరానికి ఈ గుర్తింపు దక్కడం పట్ల రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత్​లో ఈరకమైన గుర్తింపు సాధించిన ఏకైక నగరంగా హైదరాబాద్ నిలవడం రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలకు దక్కిన ఫలితం ఈ గుర్తింపు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 

 అర్బన్ కమ్యూనిటీ ఫారెస్ట్రీ వైపు అడుగులు వేసినందుకు హైదరాబాద్​ను ట్రీ సిటీగా గుర్తించామని ఆర్బర్ డే ఫౌండేషన్ అధ్యక్షుడు డాన్ లాంబే అన్నారు. భవిష్యత్ తరాలకు మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు నగరం అధిక ప్రాధాన్యమిచ్చిందని తెలిపారు. నగరంలో కొత్తగా రెండు కోట్ల 40 లక్షల పైచిలుకు మొక్కలు నాటడం, ఇందుకోసం 200 గంటల సేవా సమయాన్ని కేటాయించడం అభినందనీయమని లాంబే కొనియాడారు. 

Last Updated : Feb 18, 2021, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.