ETV Bharat / city

Etela land survey started : ఎమ్మెల్యే ఈటల భూముల్లో సర్వే ప్రారంభం

Etela land survey started
ఎమ్మెల్యే ఈటల భూముల్లో సర్వే ప్రారంభం
author img

By

Published : Nov 16, 2021, 11:26 AM IST

Updated : Nov 16, 2021, 12:06 PM IST

11:24 November 16

మెదక్‌ జిల్లా మాసాయిపేట మండం అచ్చంపేటలోని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూముల్లో అధికారులు సర్వే(etela rajender's land survey) ప్రారంభించారు. ఈటలకు చెందిన జమున హేచరీస్(Jamuna hatcheries) భూముల్లో రెవన్యూ అధికారులు సర్వే చేపట్టారు. అచ్చంపేట పరిధిలోని 130 సర్వే నంబర్‌లోని భూముల్లో సర్వే చేపట్టిన అధికారులు...బుధవారం రోజునా.... ఇదే గ్రామంలోని 77నుంచి 82 సర్వే నంబర్ల భూములను సర్వే చేస్తారు. ఈనెల 18న హకీంపేట పరిధిలోని భూములను సర్వే(Etela Hakeem pet lands' survey) చేయనున్నారు. గురువారం వరకు సర్వే చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

ఆక్రమణలు జరిగాయని గతంలోనే నివేదిక

మెదక్ జిల్లా(medak district news) మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. తమ భూములను ఈటల ఆక్రమించాడని(land grabbing allegations on etela) ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూ, అటవీ, అవినీతి నిరోధక, విజిలెన్స్ శాఖలు రంగంలోకి దిగాయి. అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో ఉన్న ఈటల రాజేందర్(Etela rajender) హేచరీల(Jamuna Hatcheries)తో పాటు పక్క భూముల్లో సర్వే నిర్వహించారు. సీలింగ్ భూములు, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

అప్పట్లో కోర్టుకెళ్లిన ఈటల

అధికారుల తీరుపై ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు హైకోర్టు(Telangana High court)ను ఆశ్రయించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సర్వే జరిగిందని, నివేదిక లోపభూయిష్టంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. ఈ అంశంతో సంబంధం ఉన్న వాళ్లందరికీ నోటీసులు, తగు సమయం ఇచ్చి.. సర్వే చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో జూన్ మూడో వారంలో పునఃసర్వేకు అధికారులు సిద్ధం కాగా.. కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటం వల్ల తాత్కాలికంగా వాయిదా వేశారు.

కరోనా తగ్గుముఖం పట్టడంతో అధికారులు భూముల సర్వేకు సన్నద్ధం అయ్యారు. సర్వే(MLA Etela land survey)కు రావాలంటూ ఈటల రాజేందర్ సతీమణి జమున, కుమారుడు నితిన్ రెడ్డితో పాటు మరో 154మందికి ఈ నెల 8న నోటీసులు ఇచ్చారు. జమున హేచరీస్​ గేటుకు నోటీసులు అతికించారు.

Last Updated : Nov 16, 2021, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.