ETV Bharat / city

అనుమానంతో భార్యపై ప్లాస్టిక్ రాడ్​తో దాడి.. - భార్యపై అనుమానంతో ఫ్లాస్టిక్ రాడ్​తో భర్త దాడి

భార్యపై అనుమానంతో ప్లాస్టిక్ రాడ్​తో భర్త దాడి చేశాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరులో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Husband attacks wife with plastic rod
భార్యపై ఫ్లాస్టిక్ రాడ్​తో భర్త దాడి..
author img

By

Published : Mar 12, 2021, 9:14 AM IST

అనుమానంతో భార్యపై భర్త దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్​ గుంటూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏటీ అగ్రహారానికి చెందిన శారదకు మల్లేశ్వరరావుతో 44 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. పెళ్లైనప్పటి నుంచి ఆమెపై అనుమానంతో వేధిస్తుండేవాడు.

ఈనెల 8న గొడవ పెట్టుకున్న భర్త ఆమెపై ప్లాస్టిక్ రాడ్​తో తల, నుదుటిపై దాడి చేశాడు. ఆమెకు గాయాలవ్వటంతో జీజీహెచ్​లో ప్రాథమిక చికిత్స చేయించుకుంది. పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జునరావు తెలిపారు.

ఇదీ చదవండి: పిల్లికి పాలుపోయాలంటూ... పక్కాగా ప్లాన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.