గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,005 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,98,815కు చేరింది. వైరస్ బారిన పడి మరణించన వారి సంఖ్య 7,205కు పెరిగింది.
కరోనా నుంచి మరో 324 మంది కోలుకోగా... మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,86,216కు చేరింది. ఏపీలో ప్రస్తుతం 5,394 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,142 కరోనా పరీక్షలు నిర్వహించగా... మొత్తం వైరస్ నిర్ధరణ పరీక్షలు 1,49,90,039కి పెరిగాయి.
ఇవీచూడండి: లాక్డౌన్ లేదంటూనే రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు