ETV Bharat / city

జీహెచ్‌ఎంసీగా హైదరాబాద్‌ ఎలా మారిందో తెలుసా..? - హైదరాబాద్​ ఎన్నికల కథనం

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎన్నికల సందడి నెలకొంది. డిసెంబర్‌ 1న జరగబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ ‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల కోసం వివిధ పార్టీలు ప్రచారం  మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎలా ఏర్పడింది? తొలి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?అసలు ఈ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చరిత్ర ఏంటో తెలుసుకుందాం పదండి...

how hyderabad became municipal corporation of greater hyderabad

author img

By

Published : Nov 21, 2020, 1:36 PM IST

1869లో నిజాం ప్రభుత్వం తొలిసారి మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చింది. హైదరాబాద్‌, ఛాదర్‌ఘాట్‌ను రెండు మున్సిపాలిటీలుగా మార్చింది. అప్పట్లో హైదరాబాద్‌లో నాలుగు, ఛాదర్‌ఘాట్‌లో ఐదు డివిజన్లు ఉండేవి. నిజాం సామ్రాజ్యంలో ప్రధాన మంత్రిగా పనిచేసిన సాలార్‌జంగ్‌-1 ఈ రెండు మున్సిపాలిటీలకు మున్సిపల్‌ కమిషనర్లను నియమించారు.

1933లో తొలిసారి...

1886లో ఛాదర్‌ఘాట్‌ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారింది. ఆ సమయంలో 55చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్‌ మున్సిపాలిటీలో 3.5లక్షల జనాభా మాత్రమే ఉండేది. 1921లో ఇదే హైదరాబాద్‌ 84చదరపు కిలోమీటర్లు విస్తరించింది. జనాభా కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో 1933లో ఛాదర్‌ఘాట్‌ కార్పొరేషన్‌ను హైదరాబాద్‌ మున్సిపాలిటీలో కలిపి ‘హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటు చేశారు. 1934లో తొలిసారి ఈ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు.

1950లో మళ్లీ హోదా...

1937లో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్ని కలిపి జూబ్లీహిల్స్‌ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి.. 1942లో పలు కారణాల వల్ల హైదరాబాద్‌ మున్సిపాలిటీకి కార్పొరేషన్‌ హోదాను రద్దు చేశారు. ఆ తర్వాత 1945లో సికింద్రాబాద్‌ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే 1950లో సికింద్రాబాద్‌కు కార్పొరేషన్‌ హోదా కల్పించడంతోపాటు జూబ్లీహిల్స్‌ మున్సిపాలిటీని హైదరాబాద్‌ మున్సిపాలిటీలో కలిపి తిరిగి కార్పొరేషన్‌ హోదా కల్పించారు. 1951 నుంచి 1954 వరకు హైదరాబాద్‌ కార్పొరేషన్‌కు మాడపాటి హనుమంతరావు తొలి మేయర్‌గా పనిచేశారు.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌..

1955లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం ద్వారా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ మున్సిపాలిటీలను కలిపేసి ‘మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఎంసీహెచ్‌)’గా మార్చారు. 1956లో హైదరాబాద్‌ను ఆనాటి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నిసార్లు ప్రజాప్రతినిధులను ఎన్నుకొని, కొన్నిసార్లు ప్రత్యేక అధికారుల ద్వారా పాలన సాగిస్తూ వచ్చారు. అత్యధికంగా కాంగ్రెస్‌ నాయకులే మేయర్లుగా ఉన్నారు. ఎంసీహెచ్‌లో నాలుగు జోన్లు, 7 సర్కిళ్లు ఉండేవి.

జీహెచ్‌ఎంసీగా..

హైదరాబాద్‌ చుట్టుపక్కల.. రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలో ఉన్న 12 మున్సిపాలిటీలు(ఎల్బీనగర్‌, గడ్డి అన్నారం, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, కాప్రా, అల్వాల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు), 8 పంచాయతీలు (శంషాబాద్‌, సాతమరాయ్‌, జల్లాపల్లి, మామిడిపల్లి, మంఖల్‌, అల్మాస్‌గూడ, శారదానగర్‌, రావిలాల) కలుపుకొని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కాస్త గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)గా రూపాంతరం చెందింది. 2005లోనే గ్రేటర్‌హైదరాబాద్‌ కోసం అప్పటి ప్రభుత్వం జీవో ఇవ్వగా.. కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొని 2007 ఏప్రిల్‌ 16న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆవిర్భవించింది. 175చ.కి.మీ విస్తీర్ణంలో 45లక్షల జనాభా ఉన్న ఎంసీహెచ్‌.. గ్రేటర్‌హైదరాబాద్‌గా మారడంతో విస్తీర్ణం 650చ.కి.మీకు పెరిగింది. జనాభా 2007నాటికి 67లక్షలు ఉండగా.. ప్రస్తుతం కోటి దాటింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదు జోన్లు, 18 సర్కిళ్లు, 150 వార్డులు ఉన్నాయి. మేయర్లుగా 2002-07లో తీగల కృష్ణారెడ్డి, 2009-12లో బండ కార్తీకరెడ్డి, 2012-16లో మహ్మద్‌ మాజిద్‌ హుస్సేన్‌ ఉన్నారు. 2014లో తెలంగాణ వచ్చింది. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు రామ్మోహన్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కార్పొరేషన్‌ పాలక మండలి మరో మూడు నెలల్లో ముగియనుండగా.. తాజాగా ఎన్నికల నగారా మోగింది. తెరాస, భాజపా, ఎంఐఎం పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. మరి జీహెచ్‌ఎంసీలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

ఇదీ చూడండి: భాగ్యనగరంలో ప్రగతి రథం... పెట్టుబడుల పథం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.