ETV Bharat / city

ఇంటి నిర్మాణంపై మరింత భారం

House construction : ఇంటి నిర్మాణం సామాన్య ప్రజలకు భారం అవుతోంది. చిన్న ఖనిజాల ధరలకు రెక్కలు రావడంతో స్టోన్ క్రషర్ల దగ్గర రాతి, ఇసుక, కంకర, పునాది రాళ్ల వంటి వాటి రేట్లు పెరిగాయి. ఫలితంగా సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే జంకే పరిస్థితులు ఏర్పడ్డాయి.

author img

By

Published : Apr 20, 2022, 8:00 AM IST

House construction
House construction

House construction : గనులకు సంబంధించి పెరిగిన లీజులు, ఫీజులు ధరల పెంపు ప్రభావం ఇంటి నిర్మాణంపై పడింది. మైనర్‌ మినరల్స్‌గా వ్యవహరించే చిన్న ఖనిజాల ధరలకు రెక్కలు వచ్చాయి. స్టోన్‌ క్రషర్ల దగ్గర రాతి ఇసుక, కంకర, పునాది రాళ్ల వంటి వాటి రేట్లు పెరిగాయి. పేట్రేగుతున్న స్టీలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇప్పటికే ఇంటి నిర్మాణ వ్యయంపై ప్రభావం చూపగా, తాజాగా చిన్న ఖనిజాలూ వాటి సరసన చేరి మరింత భారంగా మార్చాయి. ‘‘వెయ్యి చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.15 లక్షల ఖర్చవుతుంది. నిర్మాణసామగ్రి, ఉత్పత్తుల్లో ఒక్క మైనర్‌ మినరల్స్‌నే తీసుకుంటే రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు అదనంగా ఖర్చయ్యే అవకాశం ఉంది’’ అని సైదాబాద్‌కు చెందిన స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌ తూముల రాజు వివరించారు.

House construction in Telangana : గనుల రుసుములను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి భారీగా పెంచింది. స్టోన్‌ క్రషర్ల యజమానులు ధరల్ని అమాంతం పెంచేశారు. దాదాపు వారం పాటు తమ యూనిట్లను తాత్కాలికంగా మూసివేసి ఫీజులు పెరిగిన విషయం ప్రజల్లోకి వెళ్లేలా చూశారు. ఇంటి నిర్మాణంలో దాదాపు 10 రకాల చిన్న ఖనిజాల వినియోగం ఉంటుందని.. రాయల్టీ ఇతర ఫీజులు పెరిగిన ఫలితంగా కంకర రాళ్లు సహా కొన్నింటి ధరలు పెరిగాయని క్రెడాయ్‌ (కాన్ఫెరెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) జాతీయ ఉపాధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి తెలిపారు.

  • కొన్ని మైనర్‌ మినరల్స్‌లో పెరుగుదల ఇలా.. 20 ఎంఎం కంకర రాళ్లు 10 టన్నుల లోడ్‌ హైదరాబాద్‌లో గత నెల వరకు రూ.6 వేలకు దొరికేది. ఇప్పుడు రూ.7,500కు పైగా అమ్ముతున్నారు. స్టోన్‌ క్రషర్ల దగ్గర టన్నుకు రూ.300 ఉండేది. రవాణా ఛార్జీలతో కలిపి గతంలో టన్ను రూ.600కు విక్రయించేవారు. ఇప్పుడు రూ.425కి పైగా పెంచారు. ఇంటికి చేరే సరికి రూ.725 నుంచి రూ.750 అవుతోంది.
  • స్లాబు, గోడలు, ప్రహరీ, పునాదికి చిన్న, పెద్ద కంకర దాదాపు వంద టన్నులు అవసరం. టన్నుకు రూ.125 చొప్పునే పెరుగుదలను తీసుకుంటే రూ.12,500 వరకు అదనపు భారం. పునాదికి, ప్రహరీకి వాడే పెద్ద సైజు రాళ్లు, మొరం ధరలు కూడా పెరిగాయి.
  • రాతి ఇసుక టన్నుకు క్రషర్ల దగ్గర గతంలో రూ.280 ఉండగా, ఇప్పుడు మరో రూ.100 పెరిగింది. రవాణాఖర్చులతో కలిపి రూ.700కి అమ్ముతున్నారు.
  • వెయ్యి చ.అ.ఇంటికి 80-90 టన్నుల ఇసుక అవసరం. ఇందులో 40-50శాతం వరకు రాతి ఇసుక వాడతారు. నది ఇసుకతో పోలిస్తే ఇది దాదాపు సగం ధరకే లభిస్తుంది. టన్నుకు అదనంగా రూ.వంద పెరగడంతో నాలుగైదు వేల రూపాయల ఖర్చు పెరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.