ETV Bharat / city

అనుమతులు లేని ఆస్పత్రులపై అధికారుల ఉక్కుపాదం.. ఎక్కడికక్కడ సీజ్.. - రంగారెడ్డిలో నకిలి ఆసుపత్రులు సీజ్​

Hospitals seized: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కొరఢా ఝుళిపించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటిని ఎక్కడికక్కడ సీజ్‌ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, రికార్డులను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటికి నోటీసులు జారీ చేయటంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Hospitals
Hospitals
author img

By

Published : Sep 25, 2022, 9:07 AM IST

Updated : Sep 25, 2022, 9:41 AM IST

అనుమతులు లేని ఆస్పత్రులపై అధికారుల ఉక్కుపాదం.. ఎక్కడికక్కడ సీజ్..

Hospitals seized: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆస్పత్రులను కట్టడి చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ , రంగారెడ్డి సహా వివిధ జిల్లాల్లో ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు చేశారు. నాగర్ కర్నూల్‌లో అనుమతుల్లేని ఆసుపత్రులపై దాడులు నిర్వహించారు. జిల్లా డిప్యూటీ డీఎంహెచ్​ఓ వెంకటదాసు ఆధ్వర్యంలో సోదాలు చేసి సుస్మిత, న్యూ లైఫ్ పాలి క్లినిక్, మమత క్లినిక్‌లతో పాటు సాయికృష్ణ డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను సీజ్‌ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ఆర్​ఎంపీ క్లినిక్‌లపైనా చర్యలు తీసుకున్నారు.

సూర్యాపేటలోని విజేత హోటల్ రోడ్డులో ఉన్న శ్రీ గణపతి ఆసుపత్రిలో రికార్డులు, రోగుల కేసు షీట్ వివరాలు లేకపోవడంతో మూసివేయాలని ఆదేశాలిచ్చారు. వారంలోగా నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిచి రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. సాయి కీర్తన ఆసుపత్రిపై దాడులు చేసిన అధికారులు అర్హత లేని వారితో వైద్యం చేయిస్తున్నట్లు గుర్తించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హుజూర్‌నగర్‌లో ఆక్సిజన్ హాస్పిటల్‌ను మూసివేశారు. వైద్యుడు లేకుండా రోగులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోనూ తనిఖీలు ముమ్మరంగా కొనసాగాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నాలుగు ఆస్పత్రులను సీజ్‌ చేశారు. మూడింటికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. పట్టణంలోని శ్రీ సాయి నర్సింగ్ హోమ్‌, అక్షయ, సందీప్ డయాగ్నస్టిక్ సెంటర్, బాలాజీ క్లినిక్‌ను మూసివేశారు. నిజామాబాద్‌లో పలు ప్రైవేటు ఆస్పత్రులపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. అవసరం లేకున్నా సిజేరియన్లు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సర్కారు ఆసుపత్రులకు వెళ్లాల్సిన గర్భిణీలను ప్రైవేటుకు మల్లిస్తున్నారనే అంశంపైన విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 25, 2022, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.