కరోనా కట్టడికి రాత్రిపూట విధించిన కర్ఫ్యూను కొంతమంది ఉల్లంఘిస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంజాన్ పండుగ దగ్గరపడుతున్న దృష్ట్యా.. ప్రతి మైనార్టీ సోదరుడు మూడు దఫాలుగా మసీదులో ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు వక్ఫ్ బోర్డు ద్వారా ఉచితంగా ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడంపై ఛైర్మన్‌ను మంత్రి అభినందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడికి అహర్నిశలు కృషి చేస్తున్నారని.. అలాగే ప్రజలు కూడా సహకరించాలని మహమూద్ అలీ కోరారు. హైదరాబాద్ నాంపల్లిలో ఫ్రీ రంజాన్ గిఫ్ట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ప్రారంభించారు.
- ఇదీ చదవండి రెమ్‌డెసివిర్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం