బతుకమ్మ పండుగకు ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చిన ఎమ్మెల్సీ కవిత ఆయురారోగ్యాలతో ఉండాలని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కాంక్షించారు. హైదరాబాద్ దోమలగుడలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర క్రీడా అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకున్నారు.
వేడుకల్లో భాగంగా దివ్యాంగులకు ట్రై మోటార్ సైకిళ్లు, చిన్నారులకు సైకిళ్లను అందజేశారు. సమాజానికి ఎమ్మెల్సీ కవిత అందించిన సేవలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవిత చూపిన చొరవ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచిందని అభినందించారు. కవిత భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.