రాష్ట్రవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ హిమాయత్‌నగర్, బేగంబజార్‌లో చిన్నారులు రంగులు చల్లుకున్నారు. అనంతరం నృత్యాలు చేశారు.
వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో కరోనా దృష్ట్యా... కొన్నిచోట్ల నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నారు. నుదిటిపై తిలకం పెట్టుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. రంగులు చల్లుకొని హోరెత్తించే పాటలకు నృత్యాలు చేసి ఉల్లాసంగా గడిపారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి మదన్ గోపాల్ ఆధ్వర్యంలో హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ ఏడు కరోనా వల్ల హోలీ వేడుకలను నిరాడంబంరంగా జరుపుకుంటున్నామని మదన్ గోపాల్ తెలిపారు. కరోనా నిబంధనలు పాటించి హోళీ జరుపుకుంటున్నామని అన్నారు. పీఆర్సీ అమలు, వయోపరిమితి పెంపు వంటి ప్రభుత్వ నిర్ణయాలతో ఈ ఆనందం రెట్టింపయ్యిందని చెప్పారు.
కరోనా వ్యాప్తి వల్ల పలు చోట్ల ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా ఉన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సంబురాలు చేసుకున్నారు. ఈ ఏడు రంగుల పండుక చిన్నారుల్లో కోలాహలం నింపింది. చాలా ప్రాంతాల్లో చిన్నారులు.. కేరింతలు కొడుతూ రంగులు చల్లుకున్నారు. హోరెత్తించే డీజే పాటలకు చిందులేశారు.
- ఇదీ చదవండి : 'సైకత' హోలీ.. కరోనా జాగ్రత్తలు తప్పనిసరి!