ETV Bharat / city

కరోనా దెబ్బ: ఉద్యోగం పోయింది.. ఉపాధే దిక్కయింది - higher educated go for nrega

కరోనా.. కడుపుమీద కొట్టింది. నిన్న మొన్నటి వరకూ పెద్దవో చిన్నవో ఉద్యోగాలు చేసుకుంటూ నిమ్మలంగా సాగిన బతుకులు ఒక్కసారిగా కుదేలయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో పొట్టకూటి కోసం ఉన్నత విద్యావంతులైన యువత సైతం కూలీలుగా మారుతున్నారు. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఒక్క మే నెలలోనే రాష్ట్రంలో కొత్తగా 1,12,596 మంది ఉపాధి హామీ కింద కూలీలుగా నమోదయ్యారు. గత ఏడాది 2019 మే కంటే తాజా సంఖ్య దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి పనుల్లో ఉన్నత విద్యావంతులు, మహమ్మారి ప్రభావానికి నిరుద్యోగులుగా మారినవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దెబ్బకి వ్యాపారాలు కుదేలైన సంగతి తెలిసిందే.

ngera
ngera
author img

By

Published : Jun 29, 2020, 9:23 AM IST

నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో వీటిలో పనిచేస్తున్న చాలా మంది అకస్మాత్తుగా నిరుద్యోగులుగా మారారు. మొన్నటి వరకూ రూ.15 - రూ.20 వేలు సంపాదించిన వాళ్లు రోడ్డున పడ్డారు. నిస్సహాయ స్థితిలో కడుపు నింపుకొనేందుకు వారిలో చాలా మంది కూలీలుగా మారారు. స్వగ్రామాలకు వెళ్లి ఉపాధి హామీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొత్తగా కూలీలుగా నమోదవుతున్న వారిలో మూడొంతుల మంది ఉన్నత విద్యావంతులేనని అధికారులు చెబుతున్నారు.

సంగారెడ్డిలో అత్యధికం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌ 25 వరకూ హైదరాబాద్‌ పక్కనే ఉన్న సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 18,551 మంది ఉపాధి కూలీలుగా నమోదు చేసుకున్నారు. 17,238 మందితో రంగారెడ్డి జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. ఆసిఫాబాద్‌ జిల్లాలో 536 మంది, మంచిర్యాల జిల్లాల్లో 840 మంది నమోదు చేసుకున్నారు.

ఉపాధ్యాయుడి దైన్యం

నల్గొండ జిల్లా సింగారానికి చెందిన వంపు మహేందర్‌ది వ్యవసాయ కుటుంబం. ఎంఏ, బీఈడీ పూర్తిచేసి స్థానిక పాఠశాలలో విద్యావలంటీర్‌గా పనిచేస్తున్నారు. కరోనా కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోవడంతో బతుకు భారంగా మారింది. పొట్టకూటి కోసం ‘ఉపాధి కూలీ’గా మారారు.

సేల్స్‌మెన్‌ నుంచి కూలీగా..

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం శెట్టి ఆత్మకూరుకు చెందిన సందీప్‌ స్థానికంగా ఓ షోరూంలో సేల్స్‌మెన్‌గా పని చేసేవారు. కరోనా ప్రభావంతో షోరూం మూత పడింది. చేసేదేంలేక ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్నారు.

దంపతుల దయనీయ పరిస్థితి

నారాయణపేట జిల్లా మరికల్‌ మండలానికి చెందిన మాధవి ఐదేళ్లుగా స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. భర్త ఫొటోగ్రాఫర్‌. మహమ్మారి దెబ్బకు పాఠశాలలు మూతపడ్డాయి. ఫొటోగ్రఫీ వ్యాపారమే లేకుండా పోయింది. దీంతో భార్యాభర్తలిద్దరూ రెండు నెలల నుంచి ఉపాధి పనులకు వెళ్తున్నారు.

‘బీటెక్‌ కూలీ’..

నల్గొండ జిల్లా తస్కానిగూడానికి చెందిన వై.అశోక్‌ రెండేళ్ల కింద బీటెక్‌ పూర్తిచేశారు. శాశ్వత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే హైదరాబాద్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ చిన్న ఉద్యోగం కూడా పోవడంతో గ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ రెక్కాడితేగానీ డొక్కాడని తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటున్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.