ETV Bharat / city

ఆర్టీసీ యాజమాన్యానికి.. హైకోర్టు నోటీసు! - తెలంగాణ ఆర్టీసీ

తెలంగాణ ఆర్టీసీకి రాష్ట్ర హైకోర్టు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. అక్టోబరు 5న కోర్టుకు హాజరు కావాలని పేర్కొంది. ఉద్యోగులు తమ జీతం నుంచి ఆర్టీసీ సహకార పరపతి సంఘంలో పొదుపు చేసుకున్న మొత్తాన్ని ఆర్టీసీ వాడుకుంది. ఉద్యోగులు అడిగినా వారికి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఆర్టీసీని సమాధానం చెప్పాలంటూ.. హైకోర్టు నోటీసులు పంపింది.

High court Sent Notice To Ts Rtc
ఆర్టీసీ యాజమాన్యానికి.. హైకోర్టు నోటీసు!
author img

By

Published : Sep 12, 2020, 7:23 AM IST

తెలంగాణ ఆర్టీసీకి హైకోర్టు షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్​ 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఉద్యోగులు తమ జీతం నుంచి ప్రతి నెల 7 శాతం మొత్తాన్ని ఆర్టీసీ సహకార పరపతి సంఘంలో పొదుపు చేసుకుంటారు. సంస్థ ఆర్థిక పరిస్థితి గాడి తప్పడం వల్ల ఉద్యోగులకు సమాచారం ఇవ్వకుండానే ఆర్టీసీ ఆ మొత్తాన్ని వాడుకుంది. ఇప్పటి వరకు వడ్డీతో కలిపి ఆర్టీసీ రూ.885 కోట్ల సొమ్ము చెల్లించాల్సి ఉంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పొదుపు సంఘంలో దాచుకున్న మొత్తాన్ని ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేసుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా.. ఆర్టీసీ చెల్లించలేదు.

రూ.250 కోట్లు చెల్లించండి..

యాజమాన్యం వినియోగించుకున్న సొమ్ములో పొదుపు సంఘానికి ఆరు వారాల్లోగా రూ.250 కోట్లు చెల్లించాలంటూ హైకోర్టు 2019 నవంబరులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పది నెలలు గడుస్తున్నా యాజమాన్యం ఇప్పటికీ ఆ సొమ్ము చెల్లించలేదు. ఆగ్రహించిన పొదుపు సంఘం ఆర్టీసీపై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్‌శర్మ, ముఖ్య ఆర్థికాధికారి ఎన్‌.రమేశ్‌ వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా అక్టోబరు 5న తేదీన హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.

ఇదీ చదవండి: రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొనాలి: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.