ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టళ్లలో వెంటనే విద్యుత్, మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. పునరుద్ధరించకపోతే రేపు ఓయూ రిజిస్ట్రార్ హైకోర్టుకు రావాలని స్పష్టం చేసింది. ఓయూ హాస్టల్ విద్యార్థుల పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. దసరా సెలవుల కోసం తాము స్వస్థలాలకు వెళ్లి వచ్చేసరికి హాస్టళ్లల్లో విద్యుత్, మంచినీటి సరఫరా, మెస్ నిలిపివేశారని విద్యార్థుల తరఫున న్యాయవాది సీహెచ్.రవికుమార్ వాదించారు.
సమాచారం లేకుండా సెలవులను ఈ నెల 26 వరకు పొడిగించారన్నారు. గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన తాము హాస్టళ్లు లేకపోతే ఈ నెల 27 నుంచి జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ కాలేమన్నారు. వాదనలు విన్న హైకోర్టు హాస్టళ్లలో విద్యుత్, మంచినీటి సరఫరా వెంటనే పునరుద్ధరించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: