ETV Bharat / city

TS HC Notice : కాకతీయ, తెలుగు వర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులు - telangana high court notice to ku vc

కాకతీయ, తెలుగు వర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులు

author img

By

Published : Aug 4, 2021, 12:04 PM IST

Updated : Aug 4, 2021, 12:32 PM IST

12:02 August 04

HC Notice : కాకతీయ, తెలుగు వర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులు

కాకతీయ, తెలుగు యూనివర్సిటీల ఉప కులపతులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. కేయూ, తెలుగు యూనివర్సిటీల వీసీల నియామకంపై.. విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్ దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. 

నిబంధనలకు విరుద్ధంగా కేయూ, తెలుగు వర్సిటీ వీసీల నియామకం జరిగిందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. కాకతీయ యూనివర్శిసిటీ వీసీకి పదేళ్ల అనుభవం లేదని, తెలుగు వర్సిటీ ఉప కులపతికి 70 ఏళ్లు దాటాయని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీతో పాటు.. కేయూ వీసీ రమేశ్‌, తెలుగు వర్సిటీ వీసీ కిషన్‌రావుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు.. విచారణ అక్టోబరు 27కి వాయిదా వేసింది.

Last Updated : Aug 4, 2021, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.