ETV Bharat / city

'ఏబీవీ కేసు దర్యాప్తు వివరాలు సమర్పించండి'.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

author img

By

Published : Jul 5, 2022, 10:28 PM IST

High Court: భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో పలు ఆరోపణలతో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయస్థానం..కేసు దర్యాప్తు స్టేటస్​ను తమ ముందు ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.

high-court-hearing-on-ab-venkateswara-rao-quash-petition

AVB case in High Court: నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో పలు ఆరోపణలతో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. పిటిషనర్​పై కేసు నమోదు చేసి ఏడాదిపైనే గడిచిందని పిటిషనర్ తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. దురుద్దేశంతో కేసు నమోదు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

వాదనలు విన్న న్యాయస్థానం..కేసు దర్యాప్తు స్టేటస్​ను తమ ముందు ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వ న్యాయవాది నాలుగు వారాల సమయం కోరగా.. ధర్మాసనం రెండు వారాల సమయమిచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.