High Court on Bigg Boss reality show: నేటి యువతలో బిగ్‌బాస్ షో పట్ల ఉన్న అభిరుచి ఇంకా ఏ షోపై ఉండదేమో.. ఎందుకంటే అందులోని చూపించే సీన్లు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తున్నాయి అంటే అందులో చూపించే అశ్లీలతనే ప్రధాన కారణంగా చెప్పుతున్నారు విశ్లేషకులు. ఆ షోకు వచ్చే టీఆర్పీ రేటింగ్‌లు కూడా అంతగానే ఉంటున్నాయి. ఈ షోను చూసి యువత పక్కదారి పడుతోందని ఎందరో అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ విషయం ఇప్పుడు కోర్టు వరకు వెళ్లింది.
దీనికి అనుగుణంగా బిగ్‌బాస్ షోలో అశ్లీలత పెరిగిందని సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఐబీఎఫ్ గైడ్‌లైన్స్ పాటించలేదని పిటిషన్ తరఫు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది... ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
అశ్లీలతపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం తరఫు న్యాయవాది సమయం కావాలని కోర్టును కోరారు. ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 11కు వాయిదా వేసింది. ఇప్పుడు జరుగుతున్న బిగ్‌బాస్ రియాల్టీ షోకు హోస్ట్‌గా ప్రముఖ నటుడు నాగార్జున వ్యవహరిస్తున్నారు.
ఇవీ చదవండి: