నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సంబంధించి గుంటూరు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదంటూ.... ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేజిస్ట్రేట్ ఆదేశాలను రద్దు చేయాలన్న ప్రభుత్వ లంచ్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా... గుంటూరు ఆరో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు నిలదీసింది.
మధ్యాహ్నం 12 గంటలకు వైద్య నివేదిక ఇవ్వాలని ఆదేశించినా, సాయంత్రం 6 గంటల దాకా ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. ముందురోజు రాత్రి 11 గంటలకే ఆర్డర్ కాపీ ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం ఏంటని నిలదీసింది. సుమోటోగా ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇవ్వాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. అలాగే సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు నోటీసులివ్వాలంది. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు కోర్టులు స్పందిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ సేవలను పరిశీలించిన సీఎం కేసీఆర్