ETV Bharat / city

ఏపీహెచ్ఆర్​సీని తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? - ఏపీహెచ్ఆర్​సీని తెలంగాణలో ఏర్పాటుపై హైకోర్టు పశ్న

ఏపీహెచ్ఆర్​సీని తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏపీలో ఏదైనా ఘటన జరిగితే తెలంగాణకు వెళ్లి అక్కడి ఏపీ హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు చేయాలా ? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు పది రోజుల సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

ap high court news
ఏపీహెచ్ఆర్​సీని తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు?
author img

By

Published : Jun 23, 2021, 2:43 PM IST

ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు ? ఏపీ భూభాగం పరిధిలో ఎందుకు ఏర్పాటు చేయరని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలెందుకు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది. హెచ్ఆర్ సీ ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని పేర్కొంది. హెచ్ఆర్ సీ ఛైర్మన్ , సభ్యులను నియమించడంతో బాధ్యత తీరిపోదని , కార్యాలయం ఏర్పాటు , సిబ్బందిని కేటాయించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది . ఏపీ హెచ్ఆర్ సీ కార్యాలయం హైదరాబాద్ లో ఎందుకని ప్రశ్నించింది. సేవలు అందించాల్సింది ఏపీ నుంచి కదా అని పేర్కొంది.

ఏపీలో ఏదైనా ఘటన జరిగితే తెలంగాణకు వెళ్లి అక్కడి ఏపీ హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు చేయాలా ? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. హెచ్ఆర్​సీ ఏర్పాటు ఉద్దేశం ప్రజలకు దూరంగా ఉంచడం కాదని స్పష్టంచేసింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ .. పూర్తి వివరాలు సమర్పించేందుకు పది రోజుల సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

హెర్ఆర్​సీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడాన్ని సవాలు చేస్తూ ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఏకేఎన్ మల్లేశ్వరరావు హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పొత్తూరి సురేశ్ కుమార్ వాదనలు వినిపిస్తూ... ఛైర్మన్ , సభ్యులను నియమించినప్పటికీ హెచ్ ఆర్సీ కార్యాలయం ఏర్పాటు చేయలేదన్నారు. వీటి చిరునామా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు .

పీసీబీ భవన్​లో ఏర్పాటు చేస్తాం: ఎస్​జీపీ

ప్రభుత్వం తరఫున ఎజీపీ సుమన్ వాదిస్తూ .. హైదరాబాద్​లోని ఏపీ పీసీబీ భవన్ లోని ఓ అంతస్తులో ఏపీ హెఆర్‌సీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్కడెందుకు ఏర్పాటు చేస్తున్నారని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఏజీ స్పందిస్తూ .. లోకాయుక్త , ఏపీఈఆర్​సీ హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయన్నారు. జస్టిస్ సిటి రాజధాని కర్నూలులో ఏర్పాటుకు ప్రభుత్వం చట్టం తెచ్చిందన్నారు . ఆ చట్టంపై హైకోర్టు స్టే విధించి ఉందని గుర్తుచేశారు.హెచ్ ఆర్సీ విషయంలో ఏపీ విభజన చట్ట ప్రకారం వ్యవహరించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు పది రోజులు సమయం కోరారు.

ఇదీ చదవండి: రంగురాళ్ల చోరీ కేసులో ట్విస్ట్​ .. 17.72 కోట్ల నకిలీ నోట్లు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.