ETV Bharat / city

మొగల్తూరులో ఘనంగా కృష్టంరాజు సంస్మరణ సభ.. ప్రభాస్​ కోసం తరలివచ్చిన ఫ్యాన్స్

Hero Prabhas in Mogalthur: మొగల్తూరులోని రెబల్​స్టార్​ కృష్ణంరాజు ఇంటి వద్ద అభిమానులు హంగామా చేశారు. కృష్ణంరాజు సంస్మరణ సభకు వెళ్లిన హీరో ప్రభాస్​ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టారు.

Krishnam Raju Fans Hungama
Krishnam Raju Fans Hungama
author img

By

Published : Sep 29, 2022, 2:09 PM IST

Updated : Sep 29, 2022, 2:33 PM IST

Hero Prabhas in Mogalthur: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని స్వగృహంలో రెబల్​స్టార్​ కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. సంస్మరణ కార్యక్రమానికి ప్రభాస్‌, కృష్ణంరాజు అభిమానులు భారీగా తరలివచ్చారు. నటుడు ప్రభాస్‌ను చూసేందుకు భారీగా వచ్చిన అభిమానులు... లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు... అభిమానులను చెదరగొట్టారు. అభిమానులకు చేయి ఊపుతూ ప్రభాస్‌ అభివాదం చేశారు.

రెబల్​స్టార్ కృష్ణంరాజు లేని లోటు తీర్చలేనిదని నిమ్మల రామానాయుడు అన్నారు. రాజకీయాల్లోనూ కృష్ణంరాజు తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. అవినీతి మరక లేకుండా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారన్నారు. ప్రతి గ్రామానికీ అభివృద్ధి నిధులు ఇచ్చారన్నారు.

Krishnamraju memorial service: కృష్ణంరాజు సంస్మరణ సభకు ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం హీరో ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు తమ స్వగ్రామమైన మొగల్తూరులో పెదనాన్న సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రంగంలోకి దిగింది. కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ నెల 11న కన్నుమూశారు. దశ దిన కర్మను అక్కడే పూర్తిచేసిన కుటుంబ సభ్యులు.. ఆయన స్వగ్రామంలో సంస్మరణ సభ నిర్వహించారు.

ఘనంగా కృష్టంరాజు సంస్మరణ సభ.. ప్రభాస్​ను చూసేందుకు అభిమానులు ఆరటం

ఇవీ చదవండి:

Last Updated : Sep 29, 2022, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.