సినీ హీరో ప్రభాస్ మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. ఈ నెల 10న అభిమాని చల్లా పెదకోటి.. స్థానిక సినిమా హాలు వద్ద తన అభిమాన హీరో సినిమా రిలీజ్ సందర్భంగా బ్యానర్ కడుతూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
మండల అభిమాన సంఘం నాయకుడు చల్లా అనిల్ ప్రమాద విషయాన్ని ప్రభాస్‌కు తెలియజేశారు. దీంతో ప్రభాస్ స్పందించారు. రూ. 2 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. పెదకోటి భార్య పిచ్చమ్మ, తల్లిదండ్రులకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పవన్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'రాధేశ్యామ్' ఓటీటీలోకి అప్పుడే.. డైరెక్టర్ రాధాకృష్ణ ట్వీట్ వైరల్!