Bellamkonda Srinivas visited Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలోఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నటుడికి... ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. తన పుట్టిన రోజు కావడంతో తిరుమలకు వచ్చానని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేళ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నా పుట్టిన రోజు. అందుకే తిరుమలకు వచ్చాను. నూతన సంవత్సర వేళ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించాను.-బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సినీ నటుడు
ఇదీ చదవండి: TIRUMALA: నూతన సంవత్సర వేళ.. శ్రీవారి సేవలో ప్రముఖులు