బేగంబజార్‌లో ట్రాఫిక్‌జామ్... వాహనాలతో రోడ్డు బ్లాక్ - traffic jam in hyderabad yesterday
హైదరాబాద్ బేగంబజార్ నుంచి సిటీ కళాశాల వెళ్లే రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్‌జామ్ అయ్యింది. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు కదలేని స్థితిలో ఉండడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిటీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఉన్న నేపథ్యంలో... రోడ్డుపైనే పోలీసులు, ఏజెంట్ల వాహనాలు నిలిపారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌ను పునరుద్దరించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.
heavy traffic jam at begum bazar