నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని కొంత భాగంలోకే ప్రవేశించాయని రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లోకి విస్తరిస్తాయని తెలిపింది.
రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు ముఖ్యంగా కిందిస్థాయి గాలులు నైరుతి దిశగా రాష్ట్రంలో వీస్తున్నాయని పేర్కొంది.