రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్కు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఊహించిన దాని కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తుండటం వల్ల అధికారులు ఎల్ఆర్ఎస్ నమోదులో తలమునకలయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 12.20 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
అన్ని స్థాయిల్లో ఎల్ఆర్ఎస్ నమోదు చేస్తుండటం వల్ల స్పందన భారీగానే ఉంది. గ్రామ పంచాయితీల నుంచి ఇప్పటి వరకు 4.94 లక్షల దరఖాస్తులు, పురపాలక సంఘాల నుంచి 4.91 లక్షల దరఖాస్తులు, నగర పాలక సంస్థల నుంచి 2.34 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్‌జీటీలో విచారణ