ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... పొంగిపొర్లుతున్న జలాశయాలు.. - తెలంగాణలోని రిజర్యాయర్​లు

TS PROJECTS: రాష్ట్రవ్యాప్తంగా, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని జలాశయాలు అన్నీ నిండుకుండలుగా మారాయి. ప్రాజెక్టులు అన్నీ నిండడంతో వరద ప్రవాహాన్ని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆజ్ఞలు జారీ చేశారు.

heavy rain flood
వరద ప్రవాహం
author img

By

Published : Sep 11, 2022, 10:36 PM IST

TS PROJECTS: రాష్ట్రంలో ప్రాజెక్టుల్లోకి మరోసారి వరద ప్రవాహం పోటెత్తుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రాజెక్టులు నిండుకుండలుగా మారుతున్నాయి. శ్రీరాంసాగర్, కడెం జలశయాల నుంచి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉద్ధృతి పెరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... పొంగిపొర్లుతున్న జలాశయాలు..

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు వరద ప్రవాహం:

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ జలాశయానికి ఎగువ నుంచి లక్షా 37 వేల 850 క్యూసెక్కుల వరద వస్తోంది. 28 ప్రధాన గేట్ల ద్వారా లక్షా 49 వేల 760 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు కాగా.... ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులుగా నీరు ఉంది. కాకతీయ కాలువ ద్వారా 5 వేల 500 క్యూసెక్కులు వరద నీటిని, ఎస్కేప్ గేట్ల ద్వారా 2 వేల 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

కడెం జలాశయంలో ఐదు గేట్లు ఎత్తివేత:

నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులోకి 42 వేల 575 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ఐదు గేట్లు ఎత్తి 41 వేల 989 క్యూసెక్కులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా... ప్రస్తుతం 696 అడుగుల నీరు ఉంది. వరదగేట్లు మరిన్ని ఎత్తే అవకాశం ఉండటంతో మత్య్యకారులు, గొర్లకాపరులు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి:

నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహించిన గోదావరి తరవాత తన ఉగ్రరూపాన్ని శాంతించింది. మళ్లీ రాష్ట్రంలోనూ, ఎగువ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 32 అడుగులు వద్ద ఉన్న నీటిమట్టం మధ్యాహ్నానికి 35 అడుగులకు చేరింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద నీరు:

కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. మెడిగడ్డ బ్యారేజీకి 4 లక్షల 89 వేల 150 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో 65 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీకి లక్షా 89 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 42 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని దిగవకు వదులుతున్నారు. నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో దిగువ ప్రాంతంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.