ETV Bharat / city

గుండె ప్రయాణం : 21 కిలోమీటర్లు... 30 నిమిషాలు... - heart transportation from kamineni to apollo

ఓ నిండు ప్రాణాన్ని కాపాడేందుకు అత్యవసర సర్వీస్‌గా పరుగులు పెట్టి హైదరాబాద్ మెట్రో రైల్.. తన వంతు పాత్ర పోషించింది. బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి గుండెను మరో చోటుకు తరలించేందుకు వైద్యులు మెట్రో మార్గాన్ని ఎంచుకున్నారు. తొలిసారిగా గ్రీన్‌ఛానల్‌ ద్వారా నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ వరకు మెట్రోలో గుండెను విజయవంతంగా తరలించి.. ఓ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేశారు.

heart transportation through metro train from kamineni to apollo

author img

By

Published : Feb 2, 2021, 8:52 PM IST

Updated : Feb 2, 2021, 10:53 PM IST

కామినేని టు అపోలో... 21 కిలోమీటర్లు... 30 నిమిషాలు...

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రిలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి గుండెను.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చి ప్రాణాలు కాపాడాలి. నిరంతరం రద్దీగా ఉండే హైదరాబాద్‌ ట్రాఫిక్‌ దృష్ట్యా.. ఇది ఎంతో సమన్వయంతో జరగాలి. అదీ సాయంత్రం కావస్తున్న వేళ. ఇంకాస్త సమన్వయం కావాలి. రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్తే.. సుమారు గంటన్నర సమయం పడుతుంది. అయితే.. ఈసారి ఓ కొత్త ప్రయోగాన్ని చేయాలనుకున్నారు. రోడ్డు మీదుగా తరలించే బదులు.. మెట్రోలో తీసుకెళ్తే మరింత వేగంగా తీసుకెళ్లొచ్చని వైద్యులు భావించారు. హుటాహుటిన మెట్రో అధికారులను సంప్రదించి విషయం చెప్పారు. సత్కార్యంలో భాగస్వామ్యం అయ్యేందుకు మెట్రో అధికారులు సై అనడంతో.. తరలింపు ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రారంభమైంది.

గుండెను అపోలో​ ఆస్పత్రికి తరలించే ప్రక్రియ మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో ప్రారంభమైంది. కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్‌ వరకు అంబులెన్సులో రోడ్డుమార్గాన గుండెను తరలించారు. నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు ప్రత్యేక మెట్రో రైలులో తీసుకెళ్లారు. ఇందుకోసం తొలిసారిగా మెట్రో మార్గంలో గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ మధ్య 21 కిలోమీటర్లు, 16 మెట్రో స్టేషన్లు ఉండగా... 40 కిలోమీటర్ల వేగంతో అరగంట లోపే గమ్యస్థానానికి మెట్రో రైల్‌ గుండెను చేర్చింది.

జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసిన అధికారులు.. అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వ్యక్తికి డాక్టర్ గోఖలే నేతృత్వంలో గుండెమార్పిడి శస్త్రచికిత్స జరిగింది. అపోలో ఆస్పత్రిలో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటం వల్లే.. గుండె తరలింపు కోసం మెట్రో మార్గాన్ని ఎంచుకున్నట్లు డాక్టర్‌ గోఖలే తెలిపారు.

21 కిలోమీటర్లు... 30 నిమిషాలు...
21 కిలోమీటర్లు... 30 నిమిషాలు...

కామినేని ఆస్పత్రిలో బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన నర్సిరెడ్డి. జనవరి 30న నర్సిరెడ్డి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు కామినేని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స సమయంలో నర్సిరెడ్డికి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది. కుటుంబసభ్యులకు వైద్యులు సమాచారం ఇవ్వడంతో... వారు అవయవదానానికి ముందుకొచ్చారు. గుండెను అపోలో ఆస్పత్రికి, కాలేయం, మూత్రపిండాలను కిమ్స్‌ ఆస్పత్రిలో వేరొకరికి అమర్చేందుకు ప్రత్యేకంగా తరలించారు. నర్సిరెడ్డి తనకున్న ఎకరం సాగు చేసుకోవడంతోపాటు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. ఆయన మృతితో ఇద్దరు కుమారులు, భార్య పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ చూడండి: ఎల్బీనగర్ నుంచి జూబ్లీహిల్స్.. మెట్రోలో గుండె తరలింపు

Last Updated : Feb 2, 2021, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.