హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో వర్గ భేదాలు చోటు చేసుకున్నాయి. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్... మూడు రోజుల క్రితం ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అజారుద్దీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ రంగస్వామి తెలిపారు. హెచ్సీఏలో అజారుద్దీన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని... అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. 2019 సెప్టెంబర్లో హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఎంపికయ్యారు. అప్పటి నుంచి హెచ్సీఏలోని సభ్యులకు.. ఆయనకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
ఇదీ చూడండి: అమెరికాలో ఆగని కార్చిచ్చు- వేల ఎకరాలు దగ్ధం