"చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయండి. పౌష్ఠికాహారం తినండి. వేడి వేడి కోడిగుడ్డు గానీ, మాంసం గానీ, పప్పులు గానీ తినండి. పప్పుల్లోనూ పోషకాలుంటాయి. సి-విటమిన్ ఉండే నిమ్మరసం తాగండి. బత్తాయి, ఆరెంజ్ పండ్లు తినండి. రోజూ మూడు పూటలా వేడి నీరు తాగండి. కరోనా వైరస్ గొంతులో ఉంటుంది. వేడికి వైరస్ చచ్చిపోతది. ఇంట్లో ఉంటే పొద్దుపోతలేదనుకుంటే యోగా చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది. టీవీ పెడితే యోగ ఎలా చేయాలో చెబుతారు."
- హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి
ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలోకీ ఎంటరైన కరోనా- నేడు తొలి కేసు నమోదు