ETV Bharat / city

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​తో హరీశ్​రావు భేటీ... - TRS

బీడీ తయారీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్ రావు... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను కోరారు.

Harish Rao
author img

By

Published : Sep 20, 2019, 8:12 PM IST

Updated : Sep 20, 2019, 8:19 PM IST

రాష్ట్రంలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం గోవాలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన హరీశ్, కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను, బీడీ ఆకుల వ్యాపారాన్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చి భారీగా పన్నులు విధించడం వల్ల బీడీల వ్యాపారంపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుతం బీడీలపై 28 శాతం ,బీడీ ఆకులపై 18 శాతం జీఎస్టీ ఉందన్నారు. మహిళల ఆర్థిక పరిస్థితులతో సంబంధం కలిగిన అంశం కాబట్టి వీటిపై జీఎస్టీని ఉపసంహరించాలని కోరారు.

రాష్ట్రంలో వెయ్యి బీడీ తయారీ యూనిట్లు...

రాష్ట్రంలో వెయ్యి బీడీ తయారీ యూనిట్లున్నాయని... వీటిలో 5 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని హరీశ్ వివరించారు. ఇందులో 90 శాతానికిపైగా పేద మహిళలే ఉన్నారని తెలిపారు. బీడీలు చుట్టడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినప్పటికీ... జీవనోపాధి కోసం ఈ పని చేయకతప్పడం లేదని పేర్కొన్నారు. వీరిని ఆదుకోవడం కోసం తమ ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక్కొక్కరికీ నెలకు రూ.2016 చొప్పున ఆసరా పింఛన్​ అందిస్తున్నట్లు వెల్లడించారు.

బీడీ కార్మికుల కోసం ప్రత్యేక ఆర్థిక ప్రేరణ కార్యక్రమాలు తీసుకురావాలని కేంద్ర మంత్రికి హరీశ్​ విజ్ఞప్తి చేశారు. దీనికి నిర్మలా సీతారామన్​ సానుకూలంగా స్పందించారు. బీడీలు చేసే మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై సమగ్రమైన ప్రతిపాదనలు అందచేయాలని హరీశ్ రావును ఆమె కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు తదితరులు ఉన్నారు.

ఇవీ చూడండి:కార్పొరేట్ సుంకం తగ్గింపుపై ఎవరెవరు ఏమన్నారంటే..?

Last Updated : Sep 20, 2019, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.