ETV Bharat / city

ఏపీలో ఇద్దరు కలెక్టర్ల బదిలీకి సీఎస్‌ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు కలెక్టర్​ శ్యాముల్ ఆనంద్​కుమార్ బదిలీ అయ్యారు. ఎస్​ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

guntur collector shamuel transpersd
ఏపీలో ఇద్దరు కలెక్టర్ల బదిలీకి సీఎస్‌ ఉత్తర్వులు
author img

By

Published : Jan 26, 2021, 10:53 PM IST

Updated : Jan 26, 2021, 11:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారుల బదిలీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చిన అధికారుల జాబితా ప్రకారం ఒక్కొక్కరినీ తొలగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్​ను బదిలీ చేశారు. జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా జేసీ దినేష్ కుమార్​కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జేసీ మార్కండేయులుకు పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డిని కూడా బదిలీ చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్​కు తిరుపతి అర్బన్ బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది. వీరందరినీ సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవీ చదవండి: గణతంత్ర వేడుకలూ దీక్షా శిబిరాల్లోనే...

Last Updated : Jan 26, 2021, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.