ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది డిసెంబర్ 28న 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల దరఖాస్తు గడువును పొడిగించారు. రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు, దేవాదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం గతంలోనే నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 30, 2021 నుంచి జనవరి 19, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గతంలో ప్రకటించారు. అయితే తాజాగా దరఖాస్తు గడువును జనవరి 29 వరకు పొడిగించారు. నిరుద్యోగుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పోస్టుల వివరాలు..
►మొత్తం పోస్టుల సంఖ్య: 730
►పోస్టు: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(రెవెన్యూ డిపార్ట్‌మెంట్): 670
►అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.
► వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
►ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
►పోస్టు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3(ఎండోమెంట్స్ సబ్ సర్వీస్): 60
►అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
► వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
►ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం :
►దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
►ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.12.2021
►ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.01.2022
► ఫీజు చెల్లింపు చివరి తేదీ : 28.01.2022
►పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in