ETV Bharat / city

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామపత్రాల పరిశీలన పూర్తి

రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. సక్రమంగా లేని 15 నామపత్రాలను తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్‌ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది.

elections
elections
author img

By

Published : Feb 24, 2021, 6:36 PM IST

రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 16 నుంచి 23 వరకు అందిన దరఖాస్తులను రిటర్నింగ్‌ అధికారులు పరిశీలించారు. హైదరాబాద్‌ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ స్థానానికి 96 నామినేషన్లు నిబంధనల ప్రకారం ఉన్నాయని అధికారులు తెలిపారు. సక్రమంగా లేని 15 నామపత్రాలను తిరస్కరించినట్లు వెల్లడించారు.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి... పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి మొత్తంగా 76 నామినేషన్లు రాగా... అందులో వివిధ కారణాలతో ఇద్దరిని అనర్హులుగా ప్రకటించారు. 74 మంది పత్రాలు సరిగా ఉన్నాయని నిర్ధరించారు. నామినేషన్‌ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఇవీచూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.