ETV Bharat / city

కంప్యూటర్‌ అవసరం లేకుండా కోడింగ్‌ నేర్చుకుంటున్న విద్యార్థులు - నెక్ట్స్​ స్కిల్స్‌ వార్తలు

మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులు.. కంప్యూటర్‌ అవసరం లేకుండా కోడింగ్‌ను నేర్చుకుంటున్నారు. సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని నెక్ట్స్​ స్కిల్స్‌ 360 అంకుర సంస్థ సహకారంతో కోడింగ్‌పై పట్టు సాధిస్తున్నారు. ఇప్పటికే లక్షన్నర మంది విద్యార్థులకు శిక్షణ అందించారు.

students
students
author img

By

Published : Mar 21, 2022, 6:34 PM IST

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో... విద్యార్థి దశ నుంచే నైపుణ్యాలు పెంపొందుచుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నారులకు కోడింగ్‌ నేర్పించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ వసతులు సరిగా లేకపోవటంతో.. సాధ్యపడటం లేదు. ఇది గమనించిన నెక్ట్స్​ స్కిల్స్‌ 360 సంస్థ... కంప్యూటర్‌ అవసరం లేకుండా కోడింగ్‌ నేర్పించాలని భావించింది.

ప్రత్యేకంగా ప్రొగ్రామ్‌ కిట్

ఇందుకుగాను ప్రత్యేకంగా ప్రొగ్రామ్‌ కిట్‌ను రూపొందించారు. ఇందులో ప్రింటెడ్‌ కార్డ్‌బోర్డ్‌ కోడింగ్‌ కార్డులు రూపకల్పన చేశారు. ఈ కిట్‌ను అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తయారుచేయగా... ప్రతిష్ఠాత్మక సాల్వ్‌ గ్లోబల్‌ ఛాలెంజ్‌ అవార్డును దక్కించుకుంది.

కిట్‌తో సులువుగా కోడింగ్‌

ఆసక్తిగల విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెుదట శిక్షణ ఇస్తారు. అనంతరం వారి సాయంతో 5వ తరగతిపైగా చదివే విద్యార్థులందరికీ తర్ఫీదు ఇస్తారు. రెండున్నరేళ్లలో సుమారు లక్షన్నర మంది విద్యార్థులు, 3వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని నెక్ట్స్ స్కిల్స్‌ సంస్థ వ్యవస్థాపకురాలు సౌజన్య సూరజ్‌ వెల్లడించారు. ఈ కిట్‌తో సులువుగా కోడింగ్‌ నేర్చుకోవచ్చని వెల్లడించారు.

3 వేల మంది విద్యార్థులకు కోడింగ్‌ శిక్షణ

ప్రస్తుతం నారాయణపేట జిల్లాలోని 11 కేజీబీపీలు, ఆసిఫాబాద్‌లోని 6 పాఠశాలల్లో సుమారు 3 వేల మంది విద్యార్థులకు కోడింగ్‌ నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. త్వరలో వరంగల్, జగిత్యాల జిల్లాలో పది చొప్పున ప్రభుత్వ పాఠశాలతోపాటు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు నేర్పించనున్నారు. జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర, అస్సాంలోనూ శిక్షణ ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.