ఆర్టీసీ ఐకాస నేతలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఇవాళ రెండో విడతగా భేటీ కానుంది. ఆర్టీసీ ఐకాస నేతలు ఈ నెల 5న సమ్మెకు పిలుపునివ్వడం వల్ల నిన్న త్రిసభ్య కమిటీ వారితో చర్చలు జరిపింది. ఆ చర్చలు అసంపూర్తిగా ముగిసినందున తిరిగి రెండో దశ చర్చల కోసం ఇవాళ ఐకాస నేతలను కమిటీ ఆహ్వానించింది. ఈ సమావేశంలో ఐకాస నేతల డిమాండ్లు, ఆర్టీసీ సంస్థ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
ఇవీ చూడండి: "ఆర్టీసీ జేఏసీ దిగిరాకుంటే ప్లాన్ బీ సిద్ధంగా ఉంది"