రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ చేపట్టిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని తిలక్‌నగర్ యూపీహెచ్‌సీని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించారు. యూపీహెచ్సీకి వచ్చిన గవర్నర్ దంపతులకు హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, జేడీ ఇమ్యునైజేషన్ సుధీర, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ డీఎంహెచ్ఓ... స్వాగతం పలికారు.
యూపీహెచ్‌సీలో వ్యాక్సిన్ డ్రై రన్‌కి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన గవర్నర్‌కు... వైద్యులు వ్యాక్సినేషన్ పద్ధతిని వివరించారు. వ్యాక్సిన్ గురించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ జరుగనుందని... వ్యాక్సిన్ వల్ల ఎలాంటి పరిణామాలు ఉండవని స్పష్టం చేశారు. డ్రైరన్ ఏర్పాట్ల పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలంతా కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.