ETV Bharat / city

Republic Day Wishes: రాష్ట్ర ప్రజలకు గవర్నర్​, సీఎం... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

Republic Day Wishes: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్​​.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలు అందించిన సమాఖ్యస్ఫూర్తిని మరింత ధృఢంగా కొనసాగించేందుకు కంకణబద్ధులమై ఉందామని.. విలువలు, విధానాలు, హక్కుల పరిరక్షణ కోసం పునరంకితం అవుదామని తెలిపారు.

CM KCR and Governor tamilisai conveyed  Republic Day Wishes to state people

author img

By

Published : Jan 25, 2022, 7:41 PM IST

Republic Day Wishes: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య భారతదేశ సార్వభౌమత్వాన్ని గర్వంగా జరుపుకునే రోజు గణతంత్ర దినోత్సవమని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో భారత రాజ్యాంగాన్ని గొప్పగా రూపొందించిన నిర్మాతలు అంబేడ్కర్, ఇతరులకు గవర్నర్ ఘనమైన నివాళి అర్పించారు. 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని అన్ని వర్గాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

హక్కుల పరిరక్షణకు పునరంకితం..

కొవిడ్ మహమ్మారి మొదలు అన్ని రకాలుగా సేవలు అందిస్తున్న, వ్యాక్సినేషన్​ను విజయవంతం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్లకు తమిళిసై సెల్యూట్ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మూడో మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు, విధానాలు, హక్కుల పరిరక్షణ కోసం 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరం పునరంకితం అవుదామని గవర్నర్ అన్నారు.

CM KCR Republic Day Wishes: రాష్ట్రాల హక్కులు మరింతగా సంరక్షించటం వల్లే భారత ప్రజాస్వామ్య ఖ్యాతి దశ దిశలా ఫరిడవిల్లుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు 73వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం భారతదేశ ప్రధాన లక్షణమని కొనియాడారు. భిన్నసంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శిచడమే... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశం గొప్పతనమన్నారు.

సమాఖ్యస్ఫూర్తికి కంకణబద్ధులమై..

"భిన్నత్వంలో ఏకత్వం... భారతపౌరుల విశ్వమానవతత్వానికి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రాపంచిక దృక్పథానికి భారత్​ ప్రతీక. పలు రకాల వేష భాషలు, ప్రాంతాలు, నైసర్గిక స్వరూపాలతో కూడిన భారతదేశం.. రాష్ట్రాల సమాఖ్యగా ఏకత్వాన్ని ధృఢంగా కొనసాగించడం గర్వకారణం. ఇది దేశ ప్రజల రాజనీతి దార్శనికతకు నిదర్శనం. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా దేశ ప్రజాస్వామిక పునాదులను మరింతగా పటిష్టపరిచేందుకు రాజ్యాంగంలో రాష్ట్రాలను పొందుపరిచారు. మనదేశ ముఖచిత్రానికి రాష్ట్రాలు ప్రతిబింబాలుగా నిలిచాయి. యూనియన్ ఆఫ్ స్టేట్స్​గా ప్రపంచ రాజకీయ చిత్రపటంలో వెలుగొందుతున్న రాష్ట్రాల హక్కులు మరింతగా సంరక్షించబడడంతోనే భారత ప్రజాస్వామ్య ఖ్యాతి దశదిశలా ఫరిడవిల్లుతుంది. దేశంలో నూతనంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం.. రాజ్యాంగం అందించిన సమాఖ్యస్ఫూర్తిని ప్రారంభం నుంచీ ప్రదర్శిస్తోంది. రాజకీయాలు, పరిపాలనను మిళితం చేయకుండా తెలంగాణ నెరపుతున్న రాజ్యాంగబద్దమైన రాజనీతి నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. రాజ్యాంగ నిర్మాతలు అందించిన సమాఖ్యస్ఫూర్తిని మరింత ధృఢంగా కొనసాగించేందుకు కంకణబద్ధులమై ఉందాం. అందుకు అచంచల విశ్వాసంతో ప్రతినబూనుదాం." - సీఎం కేసీఆర్

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.