ఓయూ ఆంధ్రమహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఐదో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ కళాశాలలో పట్టభద్రులు కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌కు తల్లితండ్రులు, గురువుల ప్రోత్సాహం ఎంతో అవసరమని చెప్పారు. తాను గవర్నర్ స్థాయికి ఎదిగానంటే గురువులే కారణమని తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని తమిళిసై అభిప్రాయపడ్డారు. పెళ్లి తర్వాత మహిళలు చదువును ఆపకూడదని, మరింత కష్టించి లక్ష్యాలు సాధించుకోవాలని సూచించారు. నగర శివారులో జరిగిన దిశ ఘటన కలచి వేసిందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలు చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇవీచూడండి: గిరిజనుల అభ్యున్నతికి కృషి: గవర్నర్