Earth Hour on March 26th: ఏపీలో నేడు ఎర్త్‌అవర్‌ను పాటించాలని ప్రజలను ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోరారు. పర్యావరణ చైతన్యవ్యాప్తి ఉద్యమంలో భాగంగా.. రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఎర్త్‌అవర్ పాటించాలన్నారు. అత్యవసరమైతేనే లైట్లు, ఇతర పరికరాలు వాడాలని గవగ్నర్ సూచించారు. ఎర్త్ అవర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.
భూమి మీద వెలువడుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, ఇంధనాలు, విద్యుత్‌ను ఆదా చేయడం కోసం ఏర్పడిన ప్రజాచైతన్య ఉద్యమమే ఈ ఎర్త్ అవర్. పర్యావరణ చైతన్య ఉద్యమంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 26న రాత్రి ఎర్త్‌అవర్ పాటిస్తారు. ఈ సందర్భంగా.. చారిత్రక కట్టడాలు, స్మృతి కేంద్రాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో లైట్లు ఆర్పేస్తారు. గంటపాటు చీకట్లలో ఉండిపోతారు. వాతావరణ మార్పుల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు గత పదేండ్లుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: భార్య, అత్తమామలపై కత్తితో దాడి.. కత్తితో రోడ్డుపైనే దారుణంగా!