ETV Bharat / city

AP Governor recovered from corona : కొవిడ్ నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ హరిచందన్ - AP governor Bishwabushan

AP Governor recovered from corona : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇవాళ విజయవాడ చేరుకోనున్నారు.

AP Governor news, AP Governor tested corona negative, ఏపీ గవర్నర్ కరోనా న్యూస్
AP Governor news
author img

By

Published : Nov 23, 2021, 8:57 AM IST

AP Governor recovered from corona : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్... కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ హైదరాబాద్ నుంచి విజయవాడకు రానున్నారని ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా తెలిపారు.

AP Governor Vijayawada Visit :దిల్లీ పర్యటన తర్వాత విజయవాడ చేరుకున్న బిశ్వభూషణ్.. దగ్గు, జలుబుతో బాధపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యులు ఆర్టీసీపీసీఆర్​ పరీక్ష చేయించారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయణ్ని అధికారులు.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గవర్నర్‌కు చికిత్స అందించారు. కరోనా నుంచి కోలుకున్న గవర్నర్​.. ఇవాళ విజయవాడకు వెళ్లనున్నారు. గవర్నర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం విమానాశ్రాయానికి చేరుకోనున్నారు.

ఏపీ గవర్నర్​కు కరోనా సోకిన విషయం తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. బిశ్వభూషణ్‌ త్వరగా కోలుకుని దేశానికి సేవచేయాలని అన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.